మోడీ.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత.. వరుసగా రెండు సార్లు పార్టీని జాతీయ స్థాయిలో అధికారంలోకి తీసుకురాగలిగిన నేత మోడీ.. నెహ్రూ, ఇందిర, రాజీవ్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ కలిగిన నేతగానూ మోడీకి గుర్తింపు ఉంది. అందులోనూ మోడీకి ఎలాంటి వారసత్వ నేపథ్యం కూడా లేకపోవడం మరో విశేషం. మోడీ జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆరాధించే వ్యక్తులపై యూ-గవ్ డేటా అనలిటిక్స్ కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో మోడీ సత్తా చాటారు.


2021 ఏడాదికి ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీ 8వ స్థానంలో నిలిచారు. ప్రపంచంలోనే టాప్ 20లో మోడీ 8 వస్థానం దక్కించుకున్నారు. అయితే.. ఈ టాప్ 20 జాబితాలో  మన ప్రధాని మోడీయే కాదు.. ఇంకొందరు కూడా తమ సత్తా చాటారు. ఈ టాప్ 20 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ టాప్‌-20లో బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్, షారూక్‌ ఖాన్ కూడా ఉన్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ టాప్ 20లో చోటు దక్కించుకున్నారు.


అయితే ఈ టాప్ 20లో అసలు టాప్ ఎవరో చూద్దాం.. ఈ టాప్ 20లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన పని చేసి దాదాపు దశాబ్దం కావస్తున్నా ఒబామా మాత్రం ఇంకా ఆరాధనీయ వ్యక్తిగానే జనం హృదయాల్లో ఉన్నారన్నమాట. ఆ తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. వాస్తవానికి ఈయన రాజకీయ నాయకుడు కాకపోయినా.. జనం దృష్టిలో ఆరాధనీయుడిగా ఉన్నారు. అందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు.


ఇక ఈ టాప్ 20లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇదే టాప్ 20 మహిళల జాబితాలో మన బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు. వీరే కాదు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి కూడా ఉన్నారు. ఇక లేడీస్‌లో మిషెల్లీ ఒబామా, ఏంజెలీనా జోలీ, క్వీన్‌ ఎలిజబెత్-2 ఫస్ట్ 3 స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: