సాధారణంగా సైనికులు దేశం కోసం పోరాడుతూనే ఉంటారు. దేశ సరిహద్దుల్లో కి శత్రువులు చొరబడకుండా ఉండేందుకు కంటి మీద కునుకు లేకుండా గస్తీ కాస్తూ ఉంటారు. ఏ దేశంలో అయినా  సైనికులు కూడా ఇలాంటిదే చేస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్లో ఉన్న సైనికులతో మాత్రం అక్కడి ప్రభుత్వం నీచాతి నీచమైన పనులు చేస్తూ ఉంటుంది. దేశానికి రక్షణ కల్పించడం మానేసి ఏకంగా పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులుగా మార్చి సరిహద్దుల్లో దాడులకు పాల్పడేలా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా చైనాతో ఉన్న దోస్తీ కారణంగా అక్కడికి కూడా పంపించి  చైనా కు సంబంధించిన సైన్యం యూనిఫామ్స్ వేసుకుని పాకిస్తాన్ సైన్యం దారుణాలకు పాల్పడేందుకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం.



 ఇలా దేశానికి రక్షణ కల్పించడం తప్ప పాకిస్తాన్ ఆర్మీ తో అన్ని నీచమైన పనులు చేస్తూ ఉంటుంది పాకిస్థాన్ ప్రభుత్వం అన్నది ఇటీవలి కాలంలో బయటపడుతుంది. అదే సమయంలో ఇక ఒక దేశపు సైనికుడు చనిపోతే కనీస గౌరవం ఇవ్వకుండా పాకిస్థాన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. అయితే శత్రు దేశాల నుంచి దాడుల కంటే పాకిస్తాన్ ఆర్మీ కి దేశంలో ఉన్న తిరుగుబాటు దారుల నుంచి ఎక్కువగా ముప్పు పొంచి ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎంతోమంది తిరుగుబాటుదారులు.. సైనికుల పై విరుచుకుపడుతూ ప్రాణాలు తీస్తూ ఉంటారు.



 ఇలా పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వ తీరు కారణంగా ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రాణ హాని కలుగుతుందో అని అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇటీవలే పాకిస్థాన్లో చోటు చేసుకున్న  ఘటన దేశంలో పాకిస్తాన్ ఆర్మీ కి ఎంత దుస్థితి ఉంది అన్న దానికి నిదర్శనం గా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే పాకిస్థాన్లోని వజీరిస్తాన్ అసద్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికుల పై టీటీటి రెబెల్స్ దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 80 మంది సైనికుల వరకు గాయపడినట్లు తెలుస్తోంది.  సైన్యంపై ఇంత పెద్ద దాడి జరిగినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: