ప్రకృతి చాలా అందమైనది అని తెలిసిందే. ఎంత అందంగా ఉంటుందో అంతే భయాన్ని మానవులకు కలిగిస్తుంది. ఒక్కసారి ప్రకృతి కన్నెర్ర చేసింది అంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది. అందుకే ప్రకృతికి మనము ఎటువంటి హాని కలిగించకుండా ఎప్పుడూ దానిని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే సునామీ, తుఫాన్, భూకంపం లాంటి ప్రకృతి వైఫరీత్యాలను సృష్టించి మానవజాతిని హరించి వేస్తుంది. ఇది చాలా సార్లు రుజువయింది. ఈ మధ్య భూకంపాలు చాలా చోట్ల వస్తుండడం మనము చూస్తూనే ఉన్నాము. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో భూకంపం వచ్చింది. ఇక్కడ పహల్గామ్ లో తెల్లవారు జామున 5.43 గంటలకు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది.

భూకంపం సంబంచించిన ప్రాంతానికి పహల్గామ్ కు మధ్యన దాదాపుగా 15 కిలోమీటర్ల వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చలి కాలం కావడం వలన ఆ సమయానికి ఇంకా ప్రజలు నిద్ర లేవలేదు. అందుకే విషయాన్ని తెలుసుకోవడానైకి కాస్త ఆలస్యం అయింది. కానీ అదృష్టవశాత్తూ తీవ్రత ఎక్కువగా లేదు. భూకంప తీవ్రతను చూస్తే రిక్టర్ స్కేల్ పై 3.2 గా మాత్రమే నమోదు అయింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ పర్ సీస్మోలజీ ధ్రువీకరించారు. కాగా.. ఈ భూకంపం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ భూప్రకంపనలు వలన ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదు.  ఇక్కడ భూకంపం రావడం ఇది మొదటి సారి కాదు. ఈ నెలలో ఇది రెండవసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో అంటే 5 వ తేదీన కాశ్మీర్ లోయ దగ్గరలో భూమి కంపించింది. ఇలా వరుసగా భూకంపం వస్తుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి దీని పట్ల అక్కడి ప్రభుత్వం ఏ విధమైన కేహార్య్లు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: