ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై అనుమానాలు మొదలైన విషయం తెలిసిందే...అనుమానాలు అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేస్తారని ప్రచారం మొదలైంది..చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు...తమ ప్రభుత్వ తీరుపైనే చాలా అసంతృప్తిగా ఉన్నారని, అలాగే తమకు ఎందులోనూ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అసలు తమని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీలో మరీ ఎక్కువ అసంతృప్తిగా ఉన్న నేతలు..ఇప్పుడు కాకపోయిన ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలోకి రావొచ్చని ప్రచారం జరుగుతుంది. కొందరు ఎమ్మెల్యేలతో పాటు కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది..మొదటగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డిపై ఎక్కువ ప్రచారం వస్తున్న విషయం తెలిసిందే...ఇప్పటికే ఆయన పలుమార్లు వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...ఈయన తమ ప్రభుత్వ తీరుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని అర్ధమవుతుంది...అందుకే వైసీపీ వాళ్లే...ఆనం పార్టీ మారిపోవచ్చని ప్రచారం చేస్తున్నారు.

ఈయనే కాదు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్లేటు ఫిరాయించవచ్చని అంటున్నారు...అలాగే పలువురు నేతలు కూడా రివర్స్‌లో జంప్ చేయడం ఖాయమని చెబుతున్నారు. అంటే గత ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినవారు..మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది..ఇదే క్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సైతం టీడీపీలోకి రావొచ్చనే ప్రచారం జరుగుతుంది.

అలాగే గత ఎన్నికల తర్వాత టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళిన కొందరు నేతలు..మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది...శిద్ధా రాఘవరావు లాంటి వారు టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని సమాచారం. అలాగే టీడీపీని వదిలి బీజేపీలోకి కొందరు నేతలు వెళ్లారు..వాళ్ళు కూడా నెక్స్ట్ ఎన్నికల ముందు వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలా టీడీపీని వదిలేసి వెళ్ళిన బ్యాచ్...మళ్ళీ టీడీపీ లో చేరేందుకు చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: