ఎంత యుద్ధం చేస్తున్నా కొన్ని నియమాలు ఉంటాయి. పాత రోజుల్లోనూ ఆ యుద్ధ నియమాలు పాటించేవారు. మహిళలు, చిన్న పిల్లలకు యుద్ధం వల్ల ఆపద రాకుండా శత్రు సైన్యాలు కూడా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ.. ఇప్పుడు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న సైన్యం ఆ యుద్ధ నియమాలను సైతం పట్టించుకోవట్లేదని బాధితులు చెబుతున్నారు. తమ దేశ మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్ మండిపడుతోంది.


బ్రోవరీ ప్రాంతంలో ఓ ఉక్రెయిన్ మహిళపై..  ఆమె కన్నబిడ్డ ఎదుటే రష్యా సైనికుడు అత్యాచారానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని ఆ ఎంపీ అంటున్నారు. కానీ వీటిలో చాలా వరకూ వెలుగులోకి రావడం లేదని సదరు ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులు  ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా పిలుపు ఇస్తున్నారు.


రష్యా సైన్యం అరాచకాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా తమ దేశస్తులకు సూచిస్తున్నారు. రష్యా సైనికుల అరాచకాలను చెప్పడం ద్వారా  న్యాయాన్ని కాపాడుకుందామని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా  అంటున్నారు. ఇకపై  ఇలాంటి నేరాలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదంటున్నారు సదరు ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా.


ఒకసారి యుద్ధం అంటూ ముగిశాక.. ఇలాంటి దారుణమాలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా అంటున్నారు. ఈ బ్రోవరీ ఘటన ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రజల్లో భావోద్వేగాలకు కారణం అవుతోంది. రష్యా సైనికుల అరాచకాలపై ఉక్రెయిన్ వాసులు మండిపడుతున్నారు. బ్రోవరీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాల్సిందే అంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఘటన పూర్వాపరాలు సేకరిస్తోంది. రష్యా సైనికుల అరాచాకాలకు తగిన ఆధారాలు లభిస్తే.. ఇదో ఘోరమైన యుద్ధ నేరం అవుతుంది. రష్యా బోనులో నిలబడాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: