తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ కోతలు ప్రజలకు సెగలు పుట్టిస్తున్నాయి. అసలే ఎండాకాలం సూర్యుడు భగభగ మండిపోతుంటే దానికి తోడు ఈ విద్యుత్ కోతలు మరింత బాధపెడుతున్నాయి. ఆంధ్రా లో అయితే ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. గంటల కొద్దీ విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలోలా కాదు ఇపుడు ముఖ్య నగరాల్లోనూ కరెంట్ కోతలు నిత్యం జరుగుతూ అన్ని విధాలుగా ప్రజలకు సమస్యగా మారుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని చోట్లా కరెంట్ కోతతో జనం అల్లాడిపోతున్నారు. కొన్ని పల్లెల్లో అయితే మరి దారుణంగా పొద్దున కరెంట్ , మధ్యాహ్నం కరెంట్ అని రోజులో ఒక పూట మాత్రమే కరెంట్ ఉంటోంది.

ఉదయం 6 కు తీస్తే ఇక కరెంట్ వచ్చేది మధ్యాహ్నం పైనే, లేదా మధ్యాహ్నం 12 పైన తీస్తే ఇక సాయంత్రం 6 తర్వాతే వస్తోంది. రాజమండ్రి లో అయితే గంటల తరబడి విద్యుత్ కోతలకు తాలలేక జనం నిరసనలు తెలుపుతున్నారు. అక్కడ రాత్రి 9.30 గంటల నుండి విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇందుకు నిరసనగా రాజమండ్రి జాంపేట విద్యుత్ స్టేషన్ ను చుట్టుముట్టాయి టిడిపి శ్రేణులు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఆందోళన మొదలయ్యింది. ఈ కరెంట్ కోతల నుండి తమని రక్షించి కరెంట్ సరఫరా సరిగా ఉండేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విద్యుత్ కోతలు రోగులను సైతం మరింత ఆందోళన చెందేలా చేస్తున్నాయి.

ఈ కరెంట్ కోతల కారణంగా హాస్పిటల్స్ లో జనరేటర్ సరిగా అందుబాటులో లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు కరెంట్ కోతలు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్ ను నిలిపివేస్తూ ఉండటంతో రోజువారీ పనులకు ఆటంకం కలిగి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: