రాజకీయాలు చాలా నేలబారుగా అయిపోయాయి. ఒకపుడు ఎంతో హుందాగా జరిగిన రాజకీయాలు కాలానుగుణంగా బురదరాజకీయాలుగా మారిపోయాయి. విధానాలు, సిద్ధాంతాలతో కాకుండా ఇప్పటి రాజకీయాలు కేవలం రచ్చకోసం, ప్రత్యర్ధులపై కేవలం బురదచల్లటం కోసమే అన్నట్లుగా సాగుతోంది. ప్రత్యర్ధులపై ఈరోజు ఎంత బురదచల్లామనేది మాత్రమే ఫైర్ బ్రాండ్ రాజకీయమైపోయింది. ఒకపుడు ఫైర్ బ్రాండ్ విధానాలు, సిద్ధాంతాలపరంగా ప్రభుత్వాన్ని బాగా ఇబ్బందులుపెట్టే వారని పేరు.


కానీ ఇపుడు వ్యక్తిగతంగా ప్రత్యర్ధులను ఎంతగా గబ్బుపట్టిస్తే వాళ్ళే ఫైర్ బ్రాండ్లుగా చెలామణైపోతున్నారు. ఇదంతా ఇపుడెందుకంటే చనిపోయిన వాళ్ళని కూడా ప్రభుత్వాలు, పార్టీలు వదిలిపెట్టడంలేదు. గుజరాత్ ప్రభుత్వాన్ని 20 ఏళ్ళక్రితం కూల్చేయాలని చనిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కుట్రచేశారంటు సిట్ ఒక కేసు నమోదుచేసింది. ఎప్పుడో 20 ఏళ్ళక్రితం ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేశారని చనిపోయిన కాంగ్రెస్ నేతపై ఇపుడు కేసు నమోదుచేయటమే చాలా అసహ్యంగా ఉంది.

పటేల్ పై కేసు నమోదుచేయటం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని బీజేపీకి బాగా తెలిసినా కాంగ్రెస్ ను గబ్బుపట్టించటమే ఉద్దేశ్యంగా కేసు నమోదుచేసింది. సీన్ కట్ చేస్తే అదే పద్దతిని కాంగ్రెస్ కూడా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయోగించింది. అదేమిటంటే నేషనల్ హెరాల్డ్ కేసును ఉపయోగించుకుని సోనియా, రాహుల్ ను ఇబ్బందులు పెట్టాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు తెలిసిందే. ఇందులో నుండి బయటపడేందుకు ఆవువ్యాసం లాగ అన్నీ వ్యవహారాలను పార్టీ ట్రెజరర్ మోతీవాల్ వోరాయే చూసుకునే వారని తనకేమీ తెలీదని సోనియా సమాధానాలిచ్చారట. సోనియా చెప్పింది బాగానే ఉన్నది కానీ మరి ఈడీ మోతీలాల్ ను ఎలా విచారించటం ?

ఎందుకంటే మోతీలాల్ రెండేళ్ళక్రితమే చనిపోయారు. పార్టీలోనే కాకుండా నేషణల్ హెరాల్డ్ వ్యవహారాలు కూడా మోతీలాల్ మీదుగానే అన్నీ వ్యవహారాలు నడిచాయట. కాబట్టి అప్పట్లో జరిగిన వ్యవహారాలకు తనకేమీ సంబంధంలేదని సోనియా చెబుతున్నారు. దాంతో ఏమిచేయాలో ఈడీ దిక్కుతోచటంలేదు. చనిపోయిన నేతను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తే అదే చనిపోయిన మరోనేతను అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని దెబ్బకు దెబ్బ తీశారు సోనియా.  

మరింత సమాచారం తెలుసుకోండి: