పై ఫొటోను జాగ్రత్తగా గమనించండి.  ఆ ఫొటోపై నాలుగు ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజిని దెబ్బతీస్తున్న తాడేపల్లి ప్యాలెస్ జంట అని ఉన్న ఒక పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతిపై ఆరోపణలు. ఇప్పటికే లక్ష కోట్లు మింగి, 16 నెలలు జైల్లో జగన్ రెడ్డి. అవినీతి, కుంభకోణాలతో ప్రజల శవాల మీద తాడేపల్లి ప్యాలెస్ పాలన అని కనబడుతోంది.





ఈ పోస్టు ఉద్దేశ్యం ఏమిటో ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకుని వైరల్ చేస్తున్న ఫొటో ఆరోపణిది. ఇంతకీ ఈ ఫొటోని వైరల్ చేస్తున్నదెవరంటే టీడీపీకి అనుబంధంగా ఐటి వ్యవహారాలు చూస్తే ఐ టీడీపీ అధికారిక ట్విట్టర్. ఇందులోని నాలుగు ఆరోపణల్లో జగన్ తో పాటు  ఒకటి  ఆయన భార్య వైఎస్ భారతి మీద కూడా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతిపై ఆరోపణలు అని రాసుంది.






ఈ ఆరోపణలు చేస్తున్నదెవరు ? స్వయంగా టీడీపీయే చేస్తోంది. భారతి మీద టీడీపీ నేతలు తప్ప ఇంకెవరు ఆరోపణలు చేయటంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎక్కడ కూడా భారతిపేరును ప్రస్తావించలేదు. సీబీఐ ప్రస్తావించకపోయినా టీడీపీ నేతలు మాత్రం భారతి పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే బురదచల్లటంలో కూడా టీడీపీ చాలా చవకబారు స్ధాయికి దిగజారిపోయిందని అర్ధమవుతోంది. స్కాంలో భారతి పేరున్నట్లు సీబీఐ ఎక్కడైనా చెప్పుంటే ఆమెపై ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుంది.





కానీ ఎవరు చెప్పకుండానే టీడీపీనే భారతిపేరుతో గోల మొదలుపెట్టి ప్రచారం జరుగుతోందని సమర్ధించుకోవటమే విచిత్రంగా ఉంది. భారతి పేరునే టీడీపీ నేతలు లాగారుకాబట్టి భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లను వైసీపీ నేతలు రచ్చకీడుస్తున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో వచ్చిన బ్రాండ్లన్నింటికీ భువనేశ్వరి, బ్రాహ్మణీలే కమీషన్లు తీసుకుని ఆమోదముద్ర వేయించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనవసరంగా ఆడవాళ్ళను తమ క్షుద్రరాజకీయాల్లోకి టీడీపీ నేతలు లాగటం ఎందుకు ? భువనేశ్వరి, బ్రాహ్మణిపై ఆరోపణలు చేస్తారా అని గింజుకోవటం ఎందుకు ?  



మరింత సమాచారం తెలుసుకోండి: