
ఇప్పుడు అదే ఫార్ములా షర్మిల పాటిస్తోంది అని అంతా అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా పాదయాత్ర చేయడం వలన ప్రజల కష్టాలు , ప్రభుత్వం ఏ విధంగా పాలన సాగిస్తోంది అన్న చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే పాదయాత్ర మొదలు పెట్టి విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతోంది. కానీ సోమవారం రోజున జరిగిన సంఘటన వలన పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోయింది. తెరాస కు చెందిన కార్యకర్తలు కొందరు షర్మిల కారుపై దాడి చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ తరువాత షర్మిల ఏ మాత్రం తగ్గకుండా ద్వంసం అయిన కారుతోనే డ్రైవ్ చేసుకుంటూ పోయి ప్రగతిభావం వద్ద ధర్నాకు దిగింది. ఈ ఒక్క సంఘటన తెలంగాణలోని పార్టీలకు షర్మిల గురించి తమ అభిప్రాయాలను మార్చుకునేలా చేసింది.
ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డికి ఎంత మొండితనం ఉండేదో, ఇప్పుడు షర్మిలలోనూ అదే కనిపిస్తోంది అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక అధికార పార్టీ నాయకులు కూడా షర్మిల గురించి తక్కువగా అంచనా వేస్తున్నాము అంటూ లుకలుకలు మొదలయ్యాయి అంట. ప్రజలు ఎవరి మాటలకు ఎప్పుడు ఎలా తమ మనసును మార్చుకుంటారు అన్నది ఊహించడం కష్టమే. ఇక రానున్న కాలంలో షర్మిల తో జాగ్రత్త పడకపోతే కష్టమే అని తెలుస్తోంది.