ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. ఆచరణలో కానీ మాట్లాడుతున్న మాటల్లో కానీ ఆ అనుభవం ఎక్కడా కనబడటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం తమ్ముళ్ళతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలకు అస్సలు లాజిక్కు అందటంలేదు. చంద్రబాబు మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డిని ఓటమిభయం వెంటాడుతోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి ఘనవిజయం ఖాయమన్నారు.





ఇంతవరకు చంద్రబాబు చెప్పింది ఓకే అనుకోవచ్చు. కానీ అక్కడితో ఆగకుండా ఓటమిభయంతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడే చంద్రబాబు మాటల్లో లాజిక్కు మిస్సవుతోంది. నిజంగానే తాను ఓడిపోవటం ఖాయమని జగన్ అనుకుంటే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు ? ఎలాగూ ఓటమి తప్పదని అనుకున్నపుడు పూర్తికాలం అధికారంలోనే ఉండాలనే అనుకుంటారు కదా ? పదవీకాలం పూర్తికాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకుంటారా ?





ఇక రెండురోజుల క్రితమే తమ్ముళ్ళతో మాట్లాడుతు పార్టీ నిర్వీర్యమైపోయిందని ఆందోళన వ్యక్తంచేసింది చంద్రబాబు కాదా ? పార్టీ నిర్వీర్యమైపోతోందని, చెప్పిన మాటలను వినటంలేదని, పార్టీ ఆఫీసుకొచ్చి తనముందు బలప్రదర్శన చేస్తున్నారంటు మండిపోయింది ఈ చంద్రబాబే. నేతల ఆటిట్యూడ్ మార్చుకోకపోతే పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టమే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలవుతాయని కర్నూలు జిల్లా పర్యటనలో జనాలను బతిమలాడుకున్న విషయాన్ని కూడా మరచిపోయినట్లున్నారు.





టీడీపీ ఒంటరిగా పోటీచేసినా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయినా మళ్ళీ జగనే గెలుస్తాడని ఒకవైపు బహిరంగంగా చంద్రబాబే చెప్పారు. ఇందుకనే పదేపదే జనసేన, బీజేపీతో పొత్తుకు తహతహలాడిపోతున్నారు. ఒకవైపు ఓటమిభయం తనను వెంటాడుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. మరోవైపు జగన్లో ఓటమిభయం పెరిగిపోతోందని చెబుతు తన భయానికి కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు మాటలు ఎక్కడా లాజిక్కుకు అందటంలేదు. బహుశా ఓటమిభయం చంద్రబాబును వెంటాడుతున్నట్లుంది. అందుకనే తమ్ముళ్ళతో ఒక్కోరోజు ఒక్కోవిధంగా,  జిల్లాల టూర్లలో జనాలతో మరోవిధంగా మాట్లాడేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: