అధికార ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పరిపాలన రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నం అన్ని విధాలుగా రాజధానిగా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాలి. హైదరాబాద్ లాంటి సిటీ కార్పొరేషన్ తర్వాత ఎక్కువగా వార్డులు కలిగి ఉన్న కార్పొరేషన్ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం కార్పొరేషన్. అంతే కాకుండా విశాఖను స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు పై మరింత ప్రాముఖ్యత నెలకొన్నది. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే పార్టీలకు అతీతంగా కమ్మ మరియు కాపు సామాజికవర్గానికి చెందిన వారే వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా గెలవడానికి అన్ని పార్టీల నుండి పెద్ద తలకాయలు పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ నుండి జివిఎల్ నరసింహారావు , జనసేన నుండి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారట.. ఇక టీడీపీ నుండి ఎవరు పోటీ చేయనున్నారన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే అధికార వైసీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలన్న విషయంపై జగన్ కొంతమంది తో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. విశాఖ మేయర్ గా ఉన్న హరి వెంకట కుమారిని ఎంపీగా పోటీ చేయించడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈమె లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక సాధారణ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. అయితే జగన్ మాట ఇచ్చిన ప్రకారం విశాఖ సీనియర్ లీడర్ వంశీ కృష్ణ యాదవ్ ని మేయర్ చేయాలట, కానీ ఏమి జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హరి వెంకట కుమారిని మేయర్ గా వైసీపీ ప్రకటించింది. దీనితో వచ్చిన మంచి అవకాశాన్ని మేయర్ కుమారి అద్భుతంగా విశాఖను అభివృద్ధి చేయడంలో తన పూర్తి తెగువ చూపుతూ తక్కువ కాలంలోనే మంచి మేయర్ గా ప్రశంసలను అందుకుంటోంది. హరి వెంకట కుమార్ అన్ని పార్టీలతో మంచిగా మెలుగుతూ మంచి పేరు తెచుకుంటోందట. అందుకే ఈసారి విశాఖ ఎంపీగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికి చూస్తున్నారట. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. మరి జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: