వచ్చేఎన్నికల్లో గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్, కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా అందుకోవాలని చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఇద్దరికీ జీవన్మరణ సమస్యలాంటిదే కాబట్టి. సరే ఒకవైపు  ప్రయత్నాలు చేసుకుంటునే లోలోపల అధినేతలు ఇద్దరు రెగ్యులర్గా  సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ హార్డ్ కోర్ మెంబర్లు చేసిన సర్వే ఒకటి బయటపడింది.





టీడీపీ సర్వే ప్రకారం వచ్చేఎన్నికల్లో గెలుపు ఇద్దరిలో ఎవరికీ అంత వీజీ కాదట. అంటే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించకమానదు అనే సంకేతాలు కనబడుతున్నాయి. గడచిన నాలుగు నెలలుగా టీడీపీ మద్దతుదారులతో చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఆ బృందం ఇప్పటికి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సర్వేచేసింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తొందరలోనే సర్వే మొదలుపెడుతుందట.





ఇప్పటివరకు చేసిన సర్వేలో ఉత్తరాంధ్రలోని గ్రామీణ ప్రాంతాల్లో జగన్ పై జనాల్లో అభిమానం విపరీతంగా ఉందట. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత కనబడిందని సమాచారం. మొత్తం 34 సీట్లలో వైసీపీ 15 సీట్లు ఖాయంగా గెలుస్తుందని తేలిందట. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో 15, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 33 సీట్లలో 12 సీట్లు తగ్గకుండా వైసీపీకి వస్తాయని తేలిందట. ఇక రాయలసీమ+నెల్లూరు జిల్లాల్లో సేకరించిన సమాచారం ప్రకారం 20-25 సీట్ల మధ్యలో అధికారపార్టీకి వస్తాయని తేలిందట. ఇవన్నీ తక్కువలో తక్కువని అనుకుంటే వచ్చేసీట్లు. సుమారు 2 శాతం అటు ఇటుగా సర్వే రిజల్టుందని తెలిసింది.





అంటే 2014లో వచ్చిన 67 సీట్లకు కాస్త అటు ఇటుగా వస్తాయని తేలిందట. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతలపైన విపరీతమైన వ్యతిరేకత కనబడిందట. ఇదంతా ఎప్పుడంటే టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తేనే. ఒకవేళ టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే మాత్రం మళ్ళీ చంద్రబాబునాయుడుకు ఓటమి తప్పదని కూడా తేలిందట. మొత్తంమీద సర్వే బృందం తేల్చిందేమంటే వైసీపీకి సుమారు 80 సీట్లు, టీడీపీ+జనసేనకు 95 సీట్లు వచ్చే అవకాశముందని.





సంక్షేమపథకాలు, పెన్షన్ విషయంలో ఉత్తరాంధ్ర  జనాల్లో బాగా సానుకూలత ఉందట. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వివిధ కారణాలతో వ్యతిరేకతుదట. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటిస్తే కానీ అసలు విషయం తెలియదని సర్వే బృందంలోని కీలకవ్యక్తి చెప్పారు. పథకాల లబ్దిదారుల అందరు జగన్ కే ఓట్లేయాలని అనుకుంటే మాత్రం టీడీపీ ఎంతమందితో పొత్తుపెట్టుకున్నా ఉపయోగం ఉండదని కూడా సర్వే బృందం అభిప్రాయపడింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: