ఇంతకాలానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిక ఏదో రూపంలో తీరేట్లుంది. ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శిలో జరుగుతున్నదంతా  అక్రమ వ్యాపారమే అని ఉండవల్లి 17 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఉండవల్లి ఆరోపణలనే సీఐడీ దాదాపు నిర్ధారించింది. ఇదే విషయమై సుప్రింకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇప్పటివరకు ఉండవల్లి ఆరోపణలకు తగ్గట్లుగానే న్యాయస్ధానం కొన్ని ఆదేశాలు ఇచ్చింది.





అయితే మార్గదర్శిలో ఎలాంటి అక్రమాలు జరగటంలేదని ఛైర్మన్  రామోజీరావు తరపున వివిధ రంగాల్లోని కొందరు వకాల్తాపుచ్చుకుని వాదిస్తున్నారు. సమాధానం చెప్పాల్సిన రామోజీ ఇంతవరకు నోరిప్పకపోయినా ఆయన తరపున కొందరు గోలచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మెల్లిగా చంద్రబాబు అండ్ కో కూడా మద్దతు మొదలుపెట్టింది. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి సవాలు విసిరారు. మార్గదర్శి వ్యాపారంలో ఎలాంటి అక్రమాలు జరగటంలేదని, ఈ విషయమై ఉండవల్లితో డిబేట్ కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.





ఇద్దరిమధ్య ఇదే విషయమై రెండుమూడు తేదీలపై చర్చ జరిగిన తర్వాత చివరకు మే నెల 14వ తేదీ ఖరారైంది. డిబేట్ టీడీపీ ఆఫీసులోనే జరిగితే బాగుంటుందని ఉండవల్లి సూచించారు. అయితే ప్లేస్ ఎక్కడన్నది ఇంకా తేలలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవీరెడ్డి ఛార్టెడ్ అకౌంటెంట్ కమ్ లాయర్. ఉండవల్లి కూడా లాయరే. పైగా బాగా క్రెడిబులిటి ఉన్న పొలిటీషియన్. మార్గదర్శి వ్యాపారమంతా అక్రమమే అని ఉండవల్లి ఆరోపణలను రామోజీ గతంలోనే అంగీకరించారు.





అసలు వ్యాపారం చేయటమే తప్పని ఉండవల్లి వాదన మొదలుపెట్టిన తర్వాత  తీసుకున్న డిపాజిట్లు రు. 2600 కోట్లను రామోజీ తిరిగిచ్చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రామోజీయే కోర్టులో చెప్పారు.  ఇక్కడే తాను తప్పుచేసినట్లు రామోజీ అంగీకరించినట్లయ్యింది. పైగా వ్యాపారంలో కొన్నిచోట్ల హెచ్యూఎఫ్ అని మరికొన్నిచోట్ల ప్రొప్రైటరీ కన్సర్నడ్ అనుంది. రెండు పద్దతుల్లోను రామోజీ చేసిన వ్యాపారం తప్పే. ఇక చిట్ ఫండ్ వ్యాపారంలో వసూలుచేసిన డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించటం మరో తప్పు. దీన్ని కూడా రామోజీ అంగీకరించినట్లు సీఐడీ విచారణలో బయటపడిందట.





ఇన్ని తప్పులుచేసిన రామోజీయే ఉండవల్లి దెబ్బకు బహిరంగంగా నోరిప్పలేకపోతున్నారు. ఇక రామోజీ తప్పులను జీవీ ఏ విధంగా సమర్ధించగలరు ? డిబేట్ అంటు జరిగితే మార్గదర్శికి, టీడీపీకి ఏకకాలంలో ఉండవల్లి చేతిలో చాకిరేవు ఖాయమనే అనిపిస్తోంది.  చూద్దాం చివరకు  ఏమి జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: