అబద్ధంచెబితే అతికినట్లుండాలని పెద్దలంటారు. బహుశా ఈ నానుడిని ఆదిరెడ్డి భవాని విన్నట్లులేదు. అందుకనే నోటికొచ్చింది చెప్పేశారు. రాజమండ్రిలో జగజ్జనని పేరుతో వీళ్ళకు ఒక చిట్ ఫండ్ సంస్ధుంది. దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆదివారం తెల్లవారుజామున ఆమె భర్త ఆదిరెడ్డి అప్పారావు, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాసరావును సీఐడీ అరెస్టుచేసింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం సీఐడీ ఆపీసుకు రాజమండ్రి  ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని వచ్చారు. మీడియాతో మాట్లిన భవానీ మామ, భర్తల అరెస్టుకు కారణం చెప్పారు.





ఇంతకీ ఆమెచెప్పిన కారణం ఏమిటంటే ఈమధ్యనే జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గెలుపుకు ఆమె ఓటేశారట. తనను ఓటువేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకున్నదట. అయినా తాను టీడీపీ అభ్యర్ధికే ఓటేశారట. అది మనసులో ఉంచుకునే ఇపుడు కక్షసాధింపులకు దిగినట్లు ఆరోపించారు. ఇక్కడ విషయం ఏమిటంటే భవానీ టీడీపీ ఎంఎల్ఏ. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేసింది కూడా టీడీపీ అభ్యర్ధే. టీడీపీ అభ్యర్ధికి టీడీపీ ఎంఎల్ఏ ఓటేస్తే ప్రభుత్వం ఎందుకు కక్షపెంచుకుంటుంది ?





ఇక్కడ భవానీ మరచిపోయిన విషయం ఏమిటంటే టీడీపీ ఎంఎల్సీ గెలుపుకు వైసీపీ నుండే నాలుగురు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఎంఎల్ఏలను పార్టీనుండి సస్పెండ్ చేసిందే కానీ వాళ్ళపైన ఎలాంటి కక్షసాధింపులకు దిగలేదు. తమ ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేయటాన్నే ఆపలేని  జగన్ ఇక టీడీపీ ఎంఎల్ఏ టీడీపీ ఎంఎల్సీ అభ్యర్ధికి ఓటేయటాన్నిఎందుకు ఆపుతారు ?





ఏమైనా భవానీ చెప్పిన కారణం అతకలేదు. చిట్ ఫండ్ సంస్ధలో అక్రమాలు జరుగుతున్నాయని, నిధుల మళ్ళింపు ఆరోపణలున్నాయని సీఐడీ చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుపై ఎలాంటి ఆరోపణలున్నాయో అలాంటి ఆరోపణలే జగజ్జనని పైనా వచ్చాయట. అందుకనే ఆదిరెడ్డిని సీఐడీ అరెస్టుచేసింది. సంస్ధలో అక్రమాలు, అవినీతి జరగలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆదిరెడ్డి ఫ్యామిలీ మీదుంది. అంతేకానీ ఏవేదో గాలిమాటలు మాట్లాడితే ఎలాంటి ఉపయోగముండదని ఎంఎల్ఏ భవానీ గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: