బుధవారం ఎల్లోమీడియా మొదటిపేజీ ఆర్టికల్ చదివిన తర్వాత అందరికీ అర్ధమయ్యేది ఇదే. ‘ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తే మహాప్రమాదం’ అనే హెడ్డింగ్ తో ఆర్ధిక నిపుణుడు జీవీ రావుతో ఎల్లోమీడియా ముఖాముఖి నిర్వహించింది. అందులో జీవీ రావు అభిప్రాయపడ్డారో లేకపోతే ఎల్లోమీడియానే ఆయనతో అలా చెప్పించిందో తెలీదు. మొత్తానికి ఆయన అభిప్రాయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా పెద్ద ఇంటర్వ్యూ ప్రకటించింది.




మార్గదర్శి చీటింగ్ కేసులో రామోజీని సీఐడీ అధికారులు దుమ్ముదులిపేస్తున్నారు. సీఐడీ దెబ్బకు రామోజీ మంచమెక్కేశారు. 87 ఏళ్ళ వయసులో తనకేమిటీ ఖర్మ అంటు తలపట్టుకున్నారు. ఇది కాలమహిమా లేకపోతే జగన్ మహిమా అంటు నెత్తి బాదుకుంటున్నారు. రామోజీకి సంబంధించి వీడియో బయటకు పొక్కటంతో ఆయన పరువంతా పోయింది. మార్గదర్శి చీటింగ్ కేసులో రామోజీ ఇరుక్కోవటం దాదాపు ఖాయమే. ఒకవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోవైపు ప్రభుత్వం రామోజీని పిండేస్తున్నాయి.




ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో రామోజీకి అర్ధంకావటంలేదు. ఎప్పుడేమవుతుందో చెప్పలేని పరిస్ధితుల్లో జగన్ అంటేనే రామోజీ కలలో కూడా భయపడుతున్నట్లున్నారు. ఎందుకంటే వచ్చేఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అయితే రామోజీ కత అయిపోయినట్లే. చంద్రబాబునాయుడు ప్రయోజనాలు లక్ష్యంగా జగన పైన రామోజీ అనవసరంగా బురదచల్లేస్తున్నారు. ఒక వ్యాపారస్తుడిగా వ్యాపారాల రక్షణను చూసుకోవాల్సింది పోయి చంద్రబాబుకు మద్దతుగా జగన్ను గబ్బుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.




రామోజీ ప్రయత్నాలతో జగన్ కు బాగా మండింది. అందుకనే ఉండవల్లి కేసులో ఇంప్లీడ్ కావటంతో రామోజీ విలవిల్లాడిపోతున్నారు. ఉండవల్లి ప్రకారం రామోజీ మోసాలు, సీఐడీ ప్రకారం మార్గదర్శి ముసుగులో హవాలా, మనీల్యాండరింగ్ అంతా బయటపడుతున్నాయి. కోర్టు కూడా ఉండవల్లి, సీఐడీ వాదనతో ఏకీభవిస్తే అంతే సంగతులు. అందుకనే జగన్ ప్రభుత్వంమీద జనాల్లో వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు రామోజీ యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. చూస్తుంటే జగన్ వల్ల ఏపీకి కాదు మహాప్రమాదం..తనకే అని రామోజీ భయపడుతున్నట్లు అర్ధమైపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: