మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీరావుకు కలలోకూడా ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను మోసంచేస్తు నిబంధనలకు విరుద్ధంగా చిట్స్ నడుపుతున్నారన్న ఆరోపణలపై సీఐడీ రామోజీతో పాటు ఆయన కోడలు, ఎండీ శైలజ మీద ఏ1, ఏ2గా కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేసులు నమోదుచేసిన సీఐడీ ఇప్పటికే రెండుసార్లు విచారణ చేసింది. మధ్యలో ఎందుకో విచారణ మందగించింది. అలాంటిది ఉరుములేని పిడుగులాగ ఒక్కసారిగా రు. 793 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసేసింది.





ఈ విషయాన్ని సీఐడీ అధికారులు ప్రెస్ నోట్ రూపంలో ప్రకటించారు. రామోజీ ఆస్తులను సీఐడీ ఎటాచ్ చేస్తుందని రామోజీయే కాదు ఎవరు కూడా ఊహించుండరు. తనను తాను ప్రభుత్వానికన్నా చాలా ఎక్కువని, చట్టాలు, నియమ, నిబంధలకు అతీతుడనని రామోజీ అనుకుంటుంటారు. అలాంటి రామోజీపైన కేసు పెట్టడమే చాలా ఎక్కువ. అలాంటిది విచారణ జరపటమే కాకుండా ఇపుడు ఆస్తులు ఎటాచ్ కూడా జరిగిపోయిందంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. 





మధ్యలో విచారణ మందగించటంతో మార్గదర్శి కేసు విచారణ ఏమైందో ఎవరికీ అర్ధంకాలేదు. అలాంటిది 793 కోట్లరూపాయల ఆస్తులను ఎటాచ్ చేయటంతో రామోజీకి ఊహించని షాక్ తగిలినట్లే అయ్యింది. ఇప్పటికి కూడా తాను నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారంచేస్తున్నట్లు రామోజీ బహిరంగంగా అంగీకరించలేదు. అయితే మార్గదర్శి సోదాలంటే మీడియా మీద దాడిగానే ఎదురుదాడి చేస్తున్నారు. రామోజీనే తానుచేస్తున్న మార్గదర్శి వ్యాపారం సక్రమమని చెప్పుకోలేకపోతుంటే సంబంధంలేని వాళ్ళు రెచ్చిపోతున్నారు.






ఏవేవో సంఘాల పేరుతో తనకు మద్దతుగా సమావేశాలు పెట్టించి, ప్రకటనలు ఇప్పించుకుంటున్నారు. చివరకు టీడీపీ కూడా రామోజీకి మద్దతుగా రంగంలోకి దిగి చివరలో చేతులెత్తేసింది. మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే అక్రమాలన్నీ నిర్ధారణ అయినట్లే చెబుతున్నారు. ఉండవల్లి పోరాటంలో ప్రభుత్వం కూడా భాగస్వామి కావటంతో ఒక్కసారిగా కేసు తీవ్రత పెరిగిపోయింది. దాంతో రామోజీలో భయం పెరిగిపోతోంది. అందుకనే జరుగుతున్నదంతా కాలమహిమా లేకపోతే జగన్ మహిమా అని తలపట్టుకున్నది.




మరింత సమాచారం తెలుసుకోండి: