ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి అన్నారు. కావున అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జాలర్లు నదిలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు.