ఉత్తరాంధ్రలోని కీలకమైన విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు స్థానిక వైసీపీ నేతలతో చేతులు కలీ లోపాయకారి ఒప్పందానికి వచ్చి ఇన్ డైరెక్ట్ గా టీడీపీ ని వదిలేసినట్లుగా కనిపిస్తున్నారు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, కోలగట్ల వీరభద్రస్వామి, పతివాడ నారాయణ స్వామి, ఆయన కుమారుడు తమ్మినాయుడు,, బొడ్డుకొండ అప్పలనాయుడు వీరంతా బొత్స తో మంచి రిలేషన్ మైంటైన్ చేయడంతో పాటు ఆయనకు అన్ని విషయాల్లో సహరిస్తున్నారట.. రాష్ట్ర నాయకుల స్థాయిలోనే కాదు జిల్లా, మండల, గ్రామా స్థాయిలో ఇక్కడి టీడీపీ నేతలు ఎవరు అధికారంలోకి వస్తే వారికీ సపోర్ట్ గా నిలుస్తున్నారట.