జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను అమలు చేయడం తో పాటు , అవినీతి కి పాల్పడిన నేతలను కలుపు మొక్కలను ఎరుతున్నట్లు ఏరడం ఇప్పుడు వాటిపై పలు విచారణా బృందాలను కూడా ఏర్పాటు చేయడం ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీడీపీ నాయకులపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం చకచక జరిగిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు బృందం కూడా ఎదుర్కొలు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలు దర్యాప్తులపై కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకున్నారు.