కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది..అవి ఆమోదం పొందాయి కూడా.. నిత్యావసర సరకుల(సవరణ) బిల్లు, 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు ఇలా బిల్లులను పార్లమెంట్ లో ఆమోదంపొందాయి.. వీటి ద్వారా రైతుల ఆదాయం పెంచడానికి అవకాశం ఉంటుందని కేంద్రం అంటుంది.. అక్రమ నిల్వలు అరికట్టడం ద్వారా ధరలను నియంత్రించవచ్చునని వెల్లడిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యానికి చక్కని వాతావరణం ఉంటుందని అభివర్ణించారు..