ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల చేరికలతో సగం కృంగిపోయిన చంద్రబాబు ను ఈ ఇద్దరి చేరికలతో మరింత క్రుంగ తీయొచ్చు.. కానీ వీరి చేరిక స్వయంగా వద్దని అంటున్నారట.. అందుకు కారణం వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలూ రెడీ అవుతున్నాయి. ఆ కారణంగానే వీరిని ఇప్పటికిప్పుడు పార్టీలోకి తీసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందుగా వీరిని చేర్చుకుని టీడీపీ కోలుకోలేని దెబ్బ తీయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.