కుంభకోణాలకు పెట్టింది పేరైన పార్టీ టీడీపీ పార్టీ.. ఆ పార్టీ అధినేత దగ్గరినుంచి చిన్న చితక లీడర్ వరకు ఆ పార్టీ లో ఉండి ఎన్ని స్కాం లు చేశారో అర్థం చేసుకోవచ్చు.. తాజాగా టీడీపీ పార్టీ లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఇప్పుడు రాష్ట్రంలో ఓ వార్త కోడై కూస్తుంది. కీలకమైన పశ్చిమ గోదావరిజిల్లాలో ఈ స్కాం జరిగినట్లు తెలుస్తుంది. అసలు జరిగిన విషయం ఏంటంటే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు తన పార్టీ ని ఎలాగైన గెలిపించాలని పార్టీ తరఫునుంచి ఖర్చుపెట్టడానికి కొంత ఫండ్ ని కూడా పంపించాడు అని అందరి తెలిసిందే..