అంతర్వేది ఆలయ రథం నిర్మాణం విషయంలో ప్రభుత్వం చెప్పింది చేస్తోంది. వచ్చే రథోత్సవం నాటికి కొత్త రథం మరిన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది.మతం మంటలు పెట్టే యత్నం ఫలించకపోవడంతో చివరకు ఇప్పుడు మళ్లీ కుల కలహాలకు కారణాలు వెదుకుతున్నారు. అందుకు అనుగుణంగానే అంతర్వేది రథం విషయంలో అగ్నికుల క్షత్రియులను రెచ్చగొట్టేపనికి పూనుకుంటున్నారు. అంతర్వేది ఆలయం విషయంలో అగ్నికుల క్షత్రియులు ప్రాధాన్యత ఉంటుంది.స్థానిక అగ్నికుల క్షత్రియుల పెద్దలందరి సమక్షంలోనే కొత్త రథానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు విస్మరించడం విడ్డూరం. మరి చంద్రబాబు ఇంత చిన్నదాన్ని పెద్దది చేయడం దేనికి దారి తెస్తుందో చూడాలి..