కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి జై కొట్టడం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ లకు అలవాటే.. ఎందుకంటే తమ పనులు చేయలన్నా, సకాలంలో కొన్ని బిల్లు లు పాస్ కావాలన్నా అక్కడి ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమే.. అందుకే ఆ పార్టీ కి, ప్రధాని కి సీఎం లు సైతం జై కొడుతూ తమ ఉడుతా భక్తి ని చూపిస్తూ ఉంటారు.. అయితే ఆసక్తి కర విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ కి ప్రతిపక్షం వ్యతిరేకంగా పనిచేస్తుంది.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మోడీకి సపోర్ట్ చేసే విషయంలో మాత్రం ఒకే తాటిపై అధికార, విపక్షాలు నడుస్తున్నాయి..