దేశంలో కరోనా వ్యాప్తి కొద్దీ కొద్దిగా తగ్గుతుందని చెప్పాలి.. గతంలో ఉన్న ఉధృతి అయితే ఇప్పుడు లేదు.. మరణాలు, కేసులు రెండు తక్కువగానే ఉన్నాయి.. అందుకే ప్రజలు కూడా ఈ కరోనా గురించి పెద్దగా ఆలోచించడం లేదు.. మునుపటిలా కరోనా గురించి పట్టించుకోకుండా బయట తమ తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు.. ఇక అందరు సాధారణ జీవితంలోకి వెళ్లిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని వదిలిపెట్టేలా కనిపించింది.. అయితే ఈ విషయాన్నీ తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయినా హై కోర్టు మర్చిపోవట్లేదు..