విశాఖ అంటే టీడీపీ అడ్డా.. జగన్ ప్రభంజనంలో కూడా ఈ విషయం స్పష్టం గా తెలిసిపోయింది.. అందుకే కాబోలు జగన్ విశాఖ మీద పట్టు కోసం రాజధాని ని అక్కడికి మార్చారు.. అంతేకాదు రాధాదాని వ్యవహారం అక్కడి నేతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది..అందుకే విశాఖ లో టీడీపీ కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఎదురయ్యింది. పార్టీ చెప్పినట్లు అమరావతి కి సై అందామా అంటే ఇక్కడ ప్రజలు ఊరుకునేలా లేరు.. పోనీ ప్రజలు చెప్పినట్లు విశాఖ కే కట్టుబడి ఉందామా అంటే పార్టీ లో చోటు ఉండేలా లేదు.. దాంతో ఏం చేయాలో తెలీక మిన్నకుండిపోయారు..