అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. జగన్ దెబ్బకు కుదేలయిపోయిన టీడీపీ ఇప్పటికి కోలుకోలేదంటే జగన్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు.. ఇక టీడీపీ ని పూర్తి గా తుడిచిపెట్టుకుని పోయే విధంగా బీజేపీ పార్టీ ఏపీ లో పాతుకుపోతుంది.. సోము వీర్రాజు వచ్చాక ఈ మార్పు చాల కనిపిస్తుంది..