రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జగన్ మూడు రాజధానులను సృష్టించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా నిర్ణయం తీసుకున్నాడు.. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరుస్తూ ఎంతో సమర్ధవంతమైన పాలనను అందిస్తున్నాడు..అయితే దీన్ని టీడీపీ నేతలు తమకు అనుగుణంగా చెప్పుకుంటున్నారు.. అమరావతి ప్రజలకు ద్రోహం చేశాడని టీడీపీ వర్గాలు అమరావతి లో ప్రచారం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వైసీపీ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.. అమరావతి పై వైసీపీ స్పష్టమైన వైఖరి తో ఉంది.. టీడీపీ చెప్పేవన్నీ ఒట్టి అపోహలు, టీడీపీ తమ రాజకీయ ఉనికిని చాటడానికి ఇలా అబద్ధపు ప్రచారకం చేస్తున్నారు అని చెప్తూ అమరావతి ప్రజలను అక్కున చేర్చుకునేది తమ ప్రభుత్వం అని చెప్తున్నారు..