చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఏమొహం పెట్టుకుని రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు..ఓ వైపు ప్రజలంతా కలిసి ఆయన్ని దారుణంగా ఓడించారు.. అదే సమయంలో వైసీపీ పార్టీ ఏపీ లొ ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా సంపాదించుకుందో అందరం చూస్తూనే ఉన్నాం..గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ కి దక్కనంత కీర్తి, గెలుపు ఒక్కసారిగా వైసీపీ కి దక్కాయి.. సీఎం జగన్ కు ప్రజాభిమానం కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువగా పెరిగింది.. దీనికి కారణం టీడీపీ పట్ల ఉన్న అసహనం అంటే పొరపాటే ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చాలావరకు వైసీపీ కి అభిమానులు ఉన్నారు. కానీ రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా అనుభవం ఉన్న చంద్రబాబు కు మొగ్గు చూపారు తప్పా అప్పుడే వైసీపీ గెలిచి ఉండేది..