రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. దీనికి తగ్గట్లే ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. ఈ దెబ్బతో టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు.. మిగిలిన సీట్లు కూడా బీజేపీ తీసుకెళ్లేలా ఉంది.. ఇక టీడీపీ పార్టీ ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే సరైన నాయకుడు లేడు.. జగన్ కూడా ఇప్పటిలో అధికారంలోంచి దిగేలా కనిపించడం లేదు..దాంతో టీడీపీ తెలంగాణా లోలా ఏపీ లో పూర్తి గా తుడిచిపెట్టుకు పోయినట్లే అని చెప్పాలి..దానికి తగ్గట్లు నేతలు కూడా ప్రవర్తిస్తున్నారు. ఏపీ లో కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు....