ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కి నిమ్మగడ్డ రమేష్ ఎంత తలనొప్పిగా తయారయ్యాడో అందరికి తెలిసిందే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ దానికి వ్యతిరేకంగా చేయడం ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.. అంతేకాదు అయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో ప్రజలకు ఆగ్రహాన్ని కలగజేస్తుంది.. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.. రాష్ట్రంలో కరోనా లేని సమయంలో అదో సాకుగా చేసుకుని అయన ఎన్నికలను వాయిదా వేయడం ఆ టైం లో ఒకింత పెద్ద వివాదానికి చర్చలేపిన విషయం అందరికి తెలిసిందే..