వైసీపీ పార్టీ 151 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది.. ఇంత బంపర్ మెజారిటీ తో పార్టీ గెలిచి ఇప్పటికి సంవత్సరంన్నర దాటిపోయింది. అయితే ఇప్పటివరకు అయితే జగన్ చేసే పనులకు ఎలాంటి బ్యాడ్ నేమ్ అయితే రాలేదు కానీ పార్టీ కొంతమంది నేతల మధ్య మాత్రం జగన్ వైఖరి తో విసిగిపోయారని వార్తలు బయటకి వస్తున్నాయి.. జగన్ ప్రవర్తనతో వారు తీవ్ర అసంతృప్తికి కూడా లోనవుతున్నారట.. అయితే సొంత నేతలతో జగన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడన్నది ఇంకా తెలియలేదు. ఎందుకింత మొండిగా జగన్ ఉన్నారని పార్టీ ని ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పట్లేదట. పాలనా లో బిజీ గా ఉంటున్నాను అని చెప్పే జగన్ కనీసం సొంత ఎమ్మెల్యేలను కలిసే టైం కూడా ఇవ్వడకపోవడం ఒకింత విమదాస్పదమైంది.