ఏపీ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న తీరును చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు జగన్ కే అధికారం కట్టబెట్టేలా ఉన్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు.. ఎన్నికల ప్రచార సమయంలో ఏదైతే చెప్పాడో అది అక్షరాలా చేసి చూపెడుతున్న జగన్ మేనిఫెస్టో లో లేనిది కూడా చేస్తూ ప్రజల మన్ననను పొందుతున్నాడు. గత ప్రభుత్వాలకంటే భిన్నంగా దూకుడుగా ముందుకు వెళుతున్నాడు పింఛన్ల పెంపు, పేదలకు ఇళ్లు, వాహన మిత్ర.. ఇత్యాది అనేక పథకాలతో జగన్ సర్కారు రోజు రోజు కి విమర్శకుల ప్రశంశలు అందుకుంటున్నాడు.