ఎవరిగోల వాడిది అన్నంట్లుంది. కేసీఆర్ ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు అక్కర్లేదు తెలంగాణ వచ్చేందుకు ఏమంత సమయంలేదు అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రపతి ఎన్నికలు కాగానే తెలంగాణ ఎందుకు ఇవ్వనున్నారో కూడా సావధానంగా వవరిస్తూ వైసీపీ పార్టీ దూకుడుని తగ్గించడానికి కాంగ్రెస్కు తెలంగాణ ఇవ్వటం తప్ప మరో గత్యంరం లేదని సెలవిస్తున్నారు. దీనిపై జాక్ నేత ప్రొఫెసర్ కోదండరామ్ ఇంతవరకు అలాంటి సంకేతాలు ఏమీ అందలేదని, రాష్ట్రపతి ఎన్నికలముందే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తే తెలంగాణ వచ్చితీరుతుంది అంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా అగాధం మరింత పెరిగినట్లుయింది. నిజానికి వీరిద్దరి మధ్యా చాలాకాలం నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీ ఇప్పట్లో తెలంగాణ ప్రకటించే సూచనేమీ తనవరకు రాలేదంటున్నారు. టీజీవెంకటేశ్ ది మరోగోల మొదట రాయల్ తెలంగాణ రావాలన్నారు. అయితే మాకేమీ రాయల్ తెలంగాణ అక్కర్లేదని తెలంగాణ వాదులు తెగేసి చెప్పడంతో ఇప్పుడు మహారాయలసీమ అంటున్నారు. రాయలసీమయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జె.సి.దివాకర్రెడ్డి మాత్రం రాయల్ తెలంగాణాకే కట్టుబడి ఉన్నానన్నారు. కాంగ్రెస్ వాదులు, కిరణ్ కుమార్రెడ్డి అధిష్టానమే చూసుకుంటుందని దాని నిర్ణయానికే కట్టుబడి ఉన్నామంటన్నారు. రాజ్యసభ సభ్యరాలైన రేణుకా చౌదరి కేంధ్రం త్వరలో ఒక నిర్ణయానికి రానున్నారంటారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తే తెలంగాణ ఇవ్వడం కష్టమేమికాదంటున్నారు. ఆంధ్ర జాక్ నేతలు భాషా రాష్ట్రాంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం మనదే కాబట్టి ఎప్పటికీ కలసి ఉండాల్సిందే అంటారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు తెలంగాఊ మీద తేల్చేకుంటే అక్కడ అడుగుపెట్టలేని పరిస్థితిలో ఉన్నామని చంద్రబాబునాయుడు త్వర పెడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న కోస్తాంధ్రలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జారిపోవటంతో దాన్ని చక్కపరచుకునే పనిలో చంధ్రబాబు ఉన్నారు. ఇక వైపీసీ పార్టీ మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు. కేంద్రం ఇస్తామంటే మేము వద్దనం అంటూ చేతులు దులుపుకుంది. వైసీపీ గౌరవ అధ్యక్షేనాలైన విజయమ్మకు జగన్కి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో వినిపించి మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. కానీ అస్తవస్త్యం అయిన జనజీవనాన్ని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు.. ఎవరి ఉద్యమాలు, జెండాలు, ఎంజెండాలు వారివే కానీ సామన్య ప్రజలకు తక్షణం కావల్సిన ధరలు అదుపులోకి తేవడం, విద్యాసంవత్సరం మొదలైనా పుస్తకాలు పంపిణీకాకపోవడం, విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, రీఎంబర్స్మెంట్లు, అంధకారం అలుముకున్న ఆంధ్రపదేశ్ లో ఉన్న పరిశ్రమలు కుదేలవ్వటంవల్ల సాటి కార్మికుల బ్రతుకులు, దుర్బరమవుతున్న సామాన్యుడి జీవనం ఎవరకీ పట్టడంలేదు. ప్రజలకు వారి సమస్యల కొరకు పాటపడే నాయకుడి కోసం భూతద్దం వేసి చూసినా ఒక్కరంటే ఒక్కరుకూడా కనబడటంలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: