హైదరాబాద్:‘స్వయంకృషి’కి మారుపేరు చిరంజీవి. తన నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. సినీమాల్లో సక్సెస్‌కు కేరాఫ్ గా నిలిచిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే సినీమాలో చిరంజీవి ఎన్నటికీ హీరోనే. రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోతాడా?అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని అతి సామాన్యమైన కుటుంబంలో చిరంజీవి జన్మించాడు.
ఒకప్పుడు కొణిదల శివశంకర్ అంటే ఎవరికీ తెలియదు. కానీ, సినీ పరిశ్రమలోకి చిరంజీవిగా అడుగుపెట్టిన తరువాత ఆయన అంటే తెలియని వారు ఉండరు. సినీ జగత్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. 149సినీమాల వరకు నటించారు. ఆయన నటించిన ప్రతి సినీమా సూపర్ డూపర్ హిట్టే. సినీమాల్లో హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయ రంగంలోకి వచ్చే సరికి ఆయన అనుకున్న విజయాన్ని సాధించలేకపోయారు. గత నాలుగేళ్ల కిందట సామాజిక న్యాయం పేరుతో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు.
సినీమాల్లో హీరో అయిన చిరంజీవి నిజజీవితంలోనూ హీరో(సీఎం)గా కావాలనుకుని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాష్ర్టమంతటా కలియ తిరిగారు.2009ఎన్నికల్లో 294అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే ఆయన గెలిచింది కేవలం పదిహేడు మాత్రమే. సీఎం కావాలంటే మూడంకెలు కావాలి. కానీ, కేవలం రెండు అంకెలకే పరిమితమయ్యాడు. దీనితో ఆయన సీఎంపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలుగా మారాయి. తాను చేరుకోవాలన్నా గమ్యం చేరుకోలేదు.
గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న క్రమంలో చిరంజీవిని తన పార్టీని గుండుగుత్తగా కాంగ్రెస్ పార్టీలో కలిపారు. తనతోనే సామాజిక న్యాయం సాధ్యమనీ ప్రారంభించిన చిరు చివరకు తనతో సాధ్యంకాదనీ, అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమనీ భావించి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం సందర్భంగా చిరుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు.
సీఎంను కాకపోయినా, కనీసం కేంద్ర మంత్రి పదవైనా దక్కుతుందనీ ఆశపడ్డ చిరంజీవి ఆ ఆశ కూడా నెరవేరలేదు. చిరంజీవిని నమ్ముకుని 70లక్షల మంది ఓట్లు వేస్తే...పార్టీని నడిపించలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. సినీమాల్లో చిరంజీవి ఎన్నోఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. కానీ, రాజకీయంలో మాత్రం పార్టీని స్థాపించిన రెండేళ్లకే మూసేశారు. మొత్తానికి చిరంజీవి సినీమాల్లో సక్సెస్ అయ్యాడు. రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
అయితే, తనకు ఓ ఇమేజ్ తీసుకువచ్చిన సినీమా వైపు వెళ్లుతాడా? లేక కష్టమైనా, నష్టమైనా రాజకీయాల్లోనే ఉండిపోతాడా? అనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. అది చిరంజీవే స్పష్టం చేయాలి. కష్టాలు చిరంజీవికి కొత్త కాదు. కానీ, రాజకీయాలు మాత్రం ఆయనకు అంతగా కలిసి వచ్చినట్లు లేవు. ఔనుకనీ...ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు.
మరింత సమాచారం తెలుసుకోండి: