హైదరాబాద్: రాష్ర్ట రాజకీయాలపై హస్తినలో హై టెన్షన్ నెలకొంది. నిమిషం నిమిషానికి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బొత్సను మారుస్తారనీ, సీఎం వర్గం, సీఎంను మారుస్తారనీ బొత్స వర్గం, ఇద్దర్ని మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారనీ ఇలా హస్తినలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ర్ట రాజకీయాలపై చర్చించడానికి వెళ్లిన సీఎం కిరణ్ బిజీబిజీగా గడుపుతున్నారు.
కేంద్ర నాయకులతో ఎడతెరిపి లేకుండా చర్చలు సాగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలుకుని అర్ధరాత్రి వరకు సీఎం కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి పొద్దుపోయాక కూడా సోనియా రాజకీయ సలహాదారుడైన అహ్మద్ పటేల్ తో సమావేశమైన కిరణ్ శుక్రవారం నాడు ఉదయమే కేంద్ర మంత్రులు వాయిలార్ రవి, గులాంనబీ ఆజాద్, ఆంటోని, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఈ బేటీపై సర్వత్రా టెన్షన్ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలందరితో కిరణ్ వరుసబెట్టి భేటీ కావడంతో చిరవగా సోనియాతో భేటీ కావడంతో ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హై టెన్షన్‌ను తెప్పిస్తున్నాయి. సోనియాగాంధీతో భేటీ తరువాత రాష్ర్టానికి సంబంధించిన నాయకత్వ మార్పు, లేక ప్రక్షాళనపై ఈ సాయంత్రంలోగా ఓ కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదనీ జోరుగా ప్రచారం జరుగుతోంది. కొసమెరుపు ఏమిటంటే గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఇప్పటి వరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దర్శనభాగ్యం కలగలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి