మారుతున్న సమాజంలో తెలుగుభాషకు ఆధరణ తగ్గుతుంది. చిన్నవయస్సు నుండే పిల్లలకు ఆంగ్ల బాషను బలవంతంగా రుద్దుతున్నారు., అయ్యా, నాయిన, అవ్వ, బువ్వ అనే తదితర పదాలు ఎవరైనా ఉపయోగిస్తే వారు ఏదో పెద్ద తప్పు చేసినట్లు చూస్తున్నారు. ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటేనే తమ పిల్లలకు భవిష్యత్తు, బతుకుదెరువుందనే భ్రమలు తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. ఫలితంగా పిల్లలను ఇంగ్గీష్ చదువులకు పంపిస్తున్నారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతొ ఘనకీర్తి కలవోడ అంటూ చిన్నప్పుడు పాఠశాలల్లో జెండా పండుగ సందర్భంగా పాడిన పాట గతానికే పరిమితమైంది. అన్ని వర్గాల వారితో పాటు ప్రభుత్వం ఆంగ్లభాషకు ప్రాధాన్యతనివ్వడంతో చాలా మంది ఆంగ్లభాష వైపు పరుగులిడుతున్నారు. దీంతో తెలుగుభాష చదువుకుంటే భవిష్యత్తు లేదనే ఆందోళన వెంటాడుతుంది. పట్టణాలు, పల్లెల్లో పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్నటువంటి పాఠశాలల్లో నూటికి నూరుశాతం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియం ఉన్నప్పటికిని ఇంగ్లీష్ భాషపై ఉన్నటువంటి మక్కువపై ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్లవిద్యను చదివిస్తున్నారు. వ్యావహారిక భాషా ఉద్యమంలో కధం తొక్కి, వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరుపొందిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలుగు వ్యావహారిక భాషతో పాటు రామ్మూర్తిని గుర్తు చేసుకోవల్సిన అవసరముంది. అయితే కొన్ని సంవత్సరాలుగా తెలుగుభాష ఆదరణ కోల్పోతున్నటువంటి సందర్భంలో తిరిగి తెలుగుభాషకు పూర్వ వైభవం తేవడం కోసం తెలుగు కవులు, రచయితలు, మేదావులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే తమ భవిష్యత్తు ఉంటుందనే భ్రమలను తొలగించడంతో పాటు ఆంగ్లంలో చదువును అభ్యసిస్తేనే రాష్ట్రంలోని వివిధ ఆఫీసులు, సంస్థల్లో ఉద్యోగం ఇస్తామనే నిబంధనలు ఉండకుండా తెలుగుభాషకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: