రాష్ట్ర రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో దళితురాలు అనే కారణంతో ఏకంగా ఎమ్మెల్యేనే వినాయక మండపంలోకి రానివ్వలేదనే ఘటన రాజకీయంగా కలకలం సృష్టించింది. అసలే సున్నితమైన సమస్య కావడంతో రాజకీయ పార్టీలు దీన్నుంచి బయటపడే మార్గం చూస్తున్నాయి. ఈ ఘటనతో కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే శ్రీదేవి చంద్రబాబు వైఖరి కారణంగానే తనపై ఇలా వివక్ష చూపించారని ఆమె కన్నీరు పెట్టుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు.


ఐతే.. ఇదంతా రాజకీయం కోసమే అంటూ టీడీపీ ఇప్పుడు స్పందిస్తోంది. దళిత నేతలతోనే వివరణ ఇప్పిస్తోంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... తాడికొండ నియోజకవర్గంలో జరిగిన సంఘటన ను సామాజిక దృకోణం లో ఖండించానని తెలిపారు. కానీ దీనిని ఎమ్మెల్యే శ్రీదేవి దీనిని రాజకీయం చేస్తూ..., చంద్రబాబు కి ముడిపెట్టడం తగదన్నారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా దివాళా కోరు రాజకీయం చేస్తోందని విమర్శించారు.


మరో తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నన్ను తెదేపా వాళ్ళు కులం పేరుతో దూషించారు అని చాలా హంగామా చేశారని విమర్శించారు. అన్ని పార్టీల వాళ్లు వినాయక విగ్రహానికి చందాలు ఇచ్చినప్పుడు వైకాపా ఎమ్మెల్యే నే ఎందుకు పిలిచారు అంటూ అక్కడ ఉన్న వైకాపా నేత అన్నారని వివరించారు.


ఇది.. ఆ ఊరిలో ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణను గొడవ కింద చిత్రీకరించారని అంటున్నారు వర్ల రామయ్య. ఎమ్మెల్యే పక్కన ఉన్న సందీప్ అనే వ్యక్తి గొడవకు దిగి చొక్కా పట్టుకున్నారు.. ఈ గొడవకు చంద్రబాబు కి ఏమి సంబంధం... ఈ సంఘటనలోకి ఎమ్మెల్యే శ్రీదేవి చంద్రబాబు ని ఎందుకు లాగారు... అంటూ ప్రశ్నించారు. అంతే కాదు.. సీఎం ఇంటి నుండి డైరెక్షన్ ఇవ్వడం వల్లే ఎమ్మెల్యే శ్రీదేవి నానా యాగీ చేశారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: