ఈ విషయమే జనాలకు అర్ధం కావటం లేదు. ప్రభుత్వ ఖజానాకు పది రూపాయలు మిగుల్చుదామని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం పదే పదే అడ్డుపడుతుండటమే విచిత్రంగా ఉంది.  చంద్రబాబు హయాంలో అవసరం లేకపోయినా పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు లబ్ది చేకూర్చే ఉద్దేశ్యంతోనే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారంటూ చాలా కాలంగా ఆరోపణలున్నాయి.

 

అందుకే అధికారంలోకి రాగానే  కంపెనీలను పిలిపించి ధరల విషయంలో సమీక్ష చేయాలని జగన్ నోటీసులిచ్చారు. దాంతో కంపెనీలు కోర్టుకెక్కాయి. ధరల సమీక్ష అధికారం ప్రభుత్వానికి లేదని, తమ అగ్రిమెంట్ ప్రకారం చివరివరకూ తమకు ధరలు చెల్లించాల్సిందే అంటూ వాదన మొదలుపెట్టాయి. సరే ఆ కంపెనీల వాదనను కోర్టు కొట్టేసిందనుకోండి అది వేరే సంగతి.

 

ధరల విషయంలో ఏమి చేయాలో ప్రభుత్వం-కంపెనీలు తేల్చుకుంటాయి. మధ్యలో కేంద్రప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటో అర్ధం కావటం లేదు. ధరలను సమీక్ష చేయాలన్న జగన్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సమస్యలు వస్తాయని కేంద్రమంత్రులు ఆర్కెసింగ్, ధర్మేంద్రప్రధాన్ పదే పదే వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళ మాటలు ఎలాగున్నాయంటే నష్టాలు వచ్చినా, భారమైనా సరే ధరలు చెల్లించాల్సిందే అన్నట్లుంది.

 

జగన్ నిర్ణయంతో విదేశీ పెట్టుబడిదారులు భయపడిపోతున్నారట. జగన్ చర్యల వల్ల దేశానికి పెట్టుబడిదారులు  రావాలంటేనే భయపడిపోతున్నారట. ఇలా విచిత్రమైన వాదనలతో కేంద్రమంత్రులు పదే పదే జగన్ ను ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావటం లేదు. ఖజానాకు పది రూపాయలు మిగులుతుందంటే ప్రోత్సహించాల్సిన కేంద్రమే జగన్ ప్రయత్నాలకు మోకాలడ్డుతోంది. వీళ్ళ మాటలు చూస్తుంటే చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడుతున్నారనే అనుమానాలొస్తున్నాయి.

 

అవినీతికి మద్దతుగా నిలబడాలా ? లేకపోతే పారదర్శక పాలనను ప్రోత్సహించాలా ? అన్న విషయాన్ని  కేంద్రమంత్రులు ముందు తేల్చుకోవాలి. జగన్ ప్రయత్నాలు సఫలమైతే లాభపడితే రాష్ట్రప్రభుత్వమే అన్న విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలి. అదే జగన్ ఫెయిలైతే లాభపడితే చంద్రబాబు మాత్రమే అని కూడా కేంద్రం గమనించాలి.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: