నచ్చితే ఆకాశానికెత్తడం.. నచ్చకపోతే పాతాళానికి తొక్కడం తెలంగాణ సీఎం కేసీఆర్ నైజంగా చెబుతారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ అదే జరుగుతుందనిపిస్తోంది. కోట్ల మంది ప్రయాణికులకు, వేల మంది ఉద్యోగులకు సంబంధించిన ఈ విషయంలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.


దీని ప్రకారం.. ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడుపుతారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఇక అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.


కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుంది. ఇక ముందు ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయి. మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివి. ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయని.. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.


గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్యాత్మక అని కేసీఆర్ ఫీలవుతున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలంటున్నారు.. ఆర్టీసీ లాంటి సమస్యలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మారాయని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ కొత్త వ్యూహం కేసీఆర్ ఎంత వరకూ అమలు చేస్తారు.. ఎంత వరకూ ఫలిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: