ప్రధాని నరేంద్ర మోడీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో గోల్డ్ బోర్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి నుంచి దాచుకున్న బంగారానికి సైతం లెక్కలను చెప్పేలా చట్టాన్ని రూపకల్పన తీసుకొని రాబోతున్నారు. అక్రమంగా దాచిన బంగారంపై కూడా పన్ను విధిస్తూ, గోల్డ్ కొనుగోళ్లపై విధి విధానాలను విడుదల చేయబోతున్నారు.


 అలాగే ఇక నుంచి ఒక వ్యక్తి దగ్గర పరిమితికి మించిన బంగారం మాత్రమే ఉండేలా నిబంధన కూడా నియమిస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండాలి అనే దానిని త్వరలో వెల్లడించ బోతున్నారు ఫిక్స్ చేయనున్నారు. పరిమితికి మించి ఉంటే కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిందే. 2016లో పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని.. ఇప్పుడు బంగారంపై ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే రెండో అతిపెద్ద కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు.


ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం రశీదులేని గోల్డ్ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాల్సి ఉంటుంది అని తెలిపారు. దీనికి కేంద్రం నిర్ణయించే రేటు ప్రకారం పన్ను చెల్లింపులు ఉండేలా ప్రణాళికలు రాబోతున్నాయి అని సమాచారం ఉంది. చాలా రోజుల నుంచి బంగారంపై ఒక నిర్దిష్టమైన పాలసీ తీసుకురావాలని భావిస్తోన్న కేంద్రం.. దీనిలో భాగంగానే నీతి ఆయోగ్ తో కలిసి ముందుకు కొనసాగుతుంది.


సమగ్రమైన పాలసీలో భాగంగా ఇప్పుడు మోడీ సర్కార్ గోల్డ్ బోర్డును ప్రకటించబోతుంది. గోల్డ్ బోర్డు విషయంపై జాతీయ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 2016 నవంబర్ లోనే పెద్దనోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ.. ఇప్పుడు కూడా నవంబర్ లోనే గోల్డ్ బోర్డు ఏర్పాటుపై ప్రకటన ఇవ్వబోతున్నారు అని సమాచారం. రానున్న రోజులలో   ఇక బంగారం  కొనాలన్నా కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు ఏమో...


మరింత సమాచారం తెలుసుకోండి: