ఈ ప్రపంచంలో తెలియనివారిని మోసం చేయడం కష్టం.. అదే తెలిసిన వారిని మోసం చేయడం చాలా తేలిక.. అది నిజమని నిరూపించాడు కృష్ణా జిల్లా వాసి. ఓ కుర్రాడిని నమ్మి పోస్ట్ ఆఫీస్ లో జమచేయమన్నందుకు.. వారికీ మాయ మాటలు చెప్పి దాదాపు 50 లక్షల తీసుకొని 300మందిని మోసం చేసిన ఘటన అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ఎంత తెలివిగా మోసం చేసినా.. ఎప్పుడో ఒకసారిగా  దొరికిపోయి.. చివరికి పోలీసులకు దొరికి పోయాడు.


ఈ విషయంపై వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా గన్నవరం మండలం బూతుమిల్లుపాడు, అజంపూడి బ్రాంచ్ లో నాగేంద్ర అనే యువకుడు పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతన్ని నమ్మి 300 మంది ఖాతాదారులగా పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలను తెరిచారు. గత ఆ సంవత్సరాలుగా జమచేసుకుంటూ వస్తున్నారు. అతను 2014 నుండి ఖాతాదారుల నుండి డబ్బు తీసుకొని పాస్ బుక్ లో జమ చేయకుండా.. ఆ సొమ్ము అంత కాజేశాడు. 


దీంతో గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి రావడం జరిగింది. గన్నవరం పోలీసులు మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకోగా.. 43 లక్షల రూపాయలు స్వాహా చేశానాని ఒప్పు కోవడం జరిగింది. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలియడంతో.. బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం జరిగింది.
 
ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మోసం చేసే వాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు... మోసపోయే వాళ్లు మోసపోతూనే ఉన్నారు. ఈ లాంటి సంఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని బాధితులు భావన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలియచేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: