పులికాట్ సరస్సులో మరోమారు బస్సు ప్రమాదం జరిగింది. ఇప్పటికే రెండుసార్లు బస్సు ప్రమాదం జరిగి ఎంతో మందికి తీవ్రగాయాలు కాగా కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి పులికాట్ సరస్సు వద్ద బస్సు ప్రమాదం జరిగి పది మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉంది. సూళ్లూరుపేట గ్రామీణ మండలంలోని కొరిడి వద్ద బస్సు పులికాట్ సరస్సు లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమించడంతో నెల్లూరులోనే ఆస్పత్రికి తరలించారు. అయితే పులికాట్ సరస్సు పై ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నప్పటికీ అందరూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. 



 వివరాల్లోకెళ్తే... సూళ్లూరుపేట నుంచి  పెర్నాడు వెళ్లే బస్సు 75 మంది ప్రయాణికులతో రాత్రి 7.45 గంటలకు బయలుదేరింది.అటకానితిప్ప నుంచి పెర్నాడుకు  వెళ్లే రహదారి అంతా గుంతలు గుట్టలుగుట్టలుగా ఉండడంతో బస్సు డ్రైవర్ బస్సును నెమ్మదిగానే నడుపుతున్నాడు. అయినప్పటికీ 8.20 గంటల సమయంలో కోరిడి  సమీపంలో జగదాంబ సెంటర్ వరకు బస్సు వచ్చేసరికి గుట్టలుగుట్టలుగా ఉన్న రోడ్డు కారణంగా బస్సు ముందు భాగంలోని మెయిన్, సెకండ్  విరిగి పోవడంతో బస్సు పులికాట్ సరస్సు లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. అయితే ఒక్కసారిగా బస్సు పులికాట్ సరస్సు లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ఓ వైపు చీకటి మరోవైపు సరస్సు తీవ్ర గాయాలు అయిన ప్పటికీ ప్రాణం  దక్కించుకోవాలనే ఆశతో అతికష్టం మీద బస్సు వెనుక అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు  ప్రయాణికులు. వెంటనే అంబులెన్స్ కి సమాచారం అందించారు. కాగా  బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ స్వల్పగాయాలతో బయటపడిన.. పది మందికి మాత్రం తీవ్ర గాయాలు కాగా ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. 



 అయితే ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి పరసారత్నం బాధిత కుటుంబీకులు తో మాట్లాడి ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా పులికాట్ సరస్సు లో ప్రమాదం జరగడం కొత్తేమీ కాదు ఇప్పటికే ఇలాంటి ఘటన ఇది మూడోసారి. సరిగాలేని రహదారి కారణంగా ఈ మార్గంలో ఇప్పటికే రెండుసార్లు బస్సులు బోల్తా కొట్టి పులికాట్ సరస్సు లోకి దూసుకెళ్లయి . అయితే ఈ రహదారి సరిచేసేందుకు ఎన్నోసార్లు నిధులు వచ్చినప్పటికీ అటవీ అడ్డంకులతో వెనక్కి వెళ్లడం జరిగింది,. అయితే రహదారికి ఇరువైపులా పులికాట్ సరస్సు ఉంది. డ్రైవర్  కాస్త అప్రమత్తంగా డ్రైవింగ్ చేసిన పులికాట్ సరస్సు లో కి బస్సు దూసుకుపోతుంది. కొన్ని కొన్ని సార్లు డ్రైవర్లు ఎంత జాగ్రత్తగా నడిపినప్పటికీ గుట్టలు గుట్టలుగా ఉన్న రహదారి కారణంగా బస్సు పులికాట్ సరస్సు లోకి దూసుకెళ్లి బోల్తా పడుతుంది . అయితే ఈ రహదారి గుండా వరుస ప్రమాదాలు జరుగుతున్నా వాటి వల్ల   ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కూడా...అయినప్పటికీ  ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా అధికారులు ఇప్పటికైనా ఈ రహదారి గురించి స్పందించి  ప్రమాదాలు జరగకుండా చూడాలని  ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: