అయోధ్యపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించడం జరిగింది. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. అయోధ్య ట్రస్టు బోర్డుకు వివాదాస్పద 2..77 ఎకరాలను అప్పగిస్తున్నాం అని సుప్రీం కోర్టు తెలియచేయడం జరిగింది. వివాదాస్పద భూమిని ఎవరికి పంచేది లేదని సుప్రీం తెలియచేసింది. 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆ భూమిని వారికి అప్పగించాలని  ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పును సుప్రీం వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో  నిర్మోహి అఖాడా వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసులో నిర్మొహి అఖాడా వాదలను ఇలా .. ఒకవేళ తీర్పు హిందూ కక్షిదారులకు అనుకూలంగా వస్తే... ప్రతిపాదిత రామ మందిరంలో పూజా కైంకర్యాల హక్కు మాకే ఇవ్వాలి. రామమందిర నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి అని. నిర్మాణం తర్వాత ఆలయ నిర్వహణ హక్కులను మాకే అప్పగించాలి. అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే వివాదాస్పద స్థలంలో ముస్లింలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ వారికి లభించే స్థలాన్ని రామ మందిరాన్ని నిర్మించుకునే నిమిత్తం హిందువులకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా ఆదేశించాలి అని కోరడం జరిగింది.


వివాదాస్పద ఆవరణకు వెలుపల మసీదు నిర్మాణం నిమిత్తం ముస్లింలకు భూమిని సమకూర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని వాదనలు జరిగాయి. ఇక షియా వక్ఫ్‌ బోర్డు పిటిషన్ ను అత్యున్నత ధర్మాసనం కొట్టి వేయడం జరిగింది. ఈ కేసులో షియా వక్ఫ్ బోర్డు ఏం వాదించిందంటే.. ముస్లిం పక్షాలు వివాదాస్పద ప్రాంతంపై హక్కులు కోరవద్దు.  అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయం నిర్మించాలి. సంబంధిత స్థలానికి మేమే హక్కుదారులం.  అలహాబాద్‌ హైకోర్టు తీర్పులో సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇచ్చిన భూమిని హిందూ కక్షిదారులకే కేటాయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: