ఆంధ్రప్రదేశ్ లో అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనేది వాస్తవం. ఇసుక నుంచి అధికారుల బదిలీ వరకు కనపడని ప్రపంచాన్ని ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటు ప్రధాన మీడియాలో తనను జనం మర్చిపోకుండా ఉండేందుకు ఏదోక రూపంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరే సమస్యా లేనట్టు ఇసుకను పట్టుకుని వేలాడుతున్న చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏ ఒక్క దానిని వదులుకోవడం లేదు.


ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రశాంత వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. దీనిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు... ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం సోషల్ మీడియా వర్గాల్లో ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ఆధారంగా చూస్తే... ఎల్వీని కేంద్రం తన సర్వీసుల్లోకి తీసుకుంది అని... అలాగే మరికొంత మంది అధికారులు కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తున్నారన్న‌దే ఆ పోస్టు సారాంశం.


వీటిని సమర్ధిస్తూ చంద్రబాబు కూడా తన ప్రసంగాలు చేస్తున్నారు. ఎల్వీని బెదిరించారని, ఆయన్ను అవమానించారని, ఆయన పోరాటం చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో సీనియర్ అధికారులను బెదిరించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంలో వారికి విలువ లేదని మీరు కూడా నిర్ణయాలు తీసుకుంటే జైలు కి వెళ్తారని అర్ధం ప‌ర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు.


అయితే ఇదే ఎల్వీపై ఎన్నిక‌ల టైంలో చంద్ర‌బాబు ఎంత‌లా విమ‌ర్శ‌లు చేశారో చూశాం. ఈ వ్యాఖ్యలకు ఆయన అనుకూల మీడియా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ అధికారులతో కొంత మందితో కూడా చంద్రబాబు నిత్యం టచ్ లో ఉంటూ వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తే ఎల్వీ గతే పడుతుందని వారికి సూచిస్తున్నార‌ట‌. మ‌రి బాబోరి బెదిరింపు రాజ‌కీయాల‌తో ఆయ‌న ఏం సాధించాల‌నుకుంటున్నారో ?  ఆయ‌న‌కే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: