లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కంటిన్యు చేసే విషయంలో మంగళవారం ఆర్టీసీలోని వివిధ కార్మిక సంఘాలు వేర్వేరుగా అత్యవసరంగా భేటి జరిపాయి. మొత్తంమీద సమ్మె విషయంలో లేబర్ కోర్టు తీర్పు వచ్చేంత వరకూ సమ్మె కంటిన్యు చేయాలని డిసైడ్ అవ్వటంతో కేసియార్ తో ఢి అంటే ఢీ అనాలన్న ఆలోచనే  కనబడుతోంది.

 

45 రోజులు పాటు ఆర్టీసీ సమ్మె వివాదాన్ని విచారించిన హై కోర్టు చివరకు పరిష్కారం చూపించలేక చేతులెత్తేసింది. చివరగా సమ్మె వివాదాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసింది. అంటే కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె చట్టబద్దమా ? లేకపోతే చట్ట విరుద్ధమా ? అని తేల్చాల్సింది ఇపుడు లేబర్ కోర్టే.

 

ఆర్టీసిలో కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధం మాత్రం కాదని గతంలోనే హై కోర్టు చెప్పింది. మరి హై కోర్టు తీర్పునే లేబర్ కోర్టు సమర్ధిస్తుందా ? లేకపోతే విభేదిస్తుందా ? అన్నది చూడాలి. ఇదే సందర్భంలో సిబ్బందిని ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో కేసియార్ కూడా లేబర్ కోర్టు తీర్పు కోసమే ఎదురు  చూస్తున్నారు.

 

లేబర్ కోర్టు గనుక సిబ్బంది సమ్మె చట్ట విరుద్ధమంటే ఉద్యోగులు ఉద్యోగాలకు నీళ్ళొదులు కోవాల్సిందే. అదే లేబర్ కోర్టు సమ్మ చట్టబద్ధమే అని తీర్పు చెబితే కేసియార్ అప్పుడేం చేస్తారో చూడాల్సిందే.

 

మొత్తం మీద కార్మికసంఘాలు మాత్రం కేసియార్ ను ఢీ కొనేందుకే సిద్ధంగా ఉన్నట్లు అర్ధమైపోతోంది.  ఎందుకంటే యూనియన్ నేతలు విడతలవారీగా కార్మికులు, ఉద్యోగులతో విడివిడిగా చర్చలు జరిపారు. భవిష్యత్తును నేతలు అందరికీ వివరించినట్లు సమాచారం.

 

అందరూ పోరుబాటుకు రెడీగా ఉన్నట్లు చెప్పగానే  కేసియార్ ను ఢీ కొనటానికే అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. మరి అంతిమ ఫలితం ఎలాగుంటుందో ఎవరూ చెప్పలేకున్నారు. ఎందుకంటే లేబర్ కోర్టులో తీర్పు ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: