జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటనకు భారతీయ జనతా పార్టీ ఫిదా అయిందా...? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయం మీద ఆయన అభిమానులకు కూడా ఎలాంటి స్పష్టతా లేదు. ఆయన ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆయన తిక్కను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో కూడా వారికి అర్ధం కాని పరిస్థితి, జనాలకు మాత్రం ఒక విషయం ఆయన ద్వారా స్పష్టత వచ్చింది. ఆయనకు నిలకడ లేదు అని ప్రజల్లో పవన్ రాజకీయంపై ఒక అదిరిపోయే అభిప్రాయం వచ్చేసింది.

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన నిలకడ లేమిలో భాగంగా బిజెపిలో తన పార్టీని విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మొన్నటి వరకు బిజెపిని తిట్టి ఇప్పుడు అదే పార్టీని పొగడటం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని గౌరవిస్తా అనడం వంటివి ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇప్పుడు ఆయన రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు, అక్కడి రైతులతో కార్యకర్తలతో స్థానిక నేతలతో ఆయన సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా ప‌వ‌న్ బీజేపీ డైరెక్ష‌న్ లోనే న‌డుస్తున్నాడ‌న్న సందేహాలు అంద‌రికి వ‌చ్చేశాయి.

 

ఇప్పుడు ఈ ప్రయత్నంలో ప‌వ‌న్‌ నటన అంతా ఇంతా కాదు. తలుపుల దగ్గర కూర్చుని మాట్లాడటం... రైతులను మహిళలను కుర్చీల్లో కూర్చోపెట్టుకుని ఈయన ప్రసంగాలు చేయడం వంటివి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక జగన్ పై ఆయన చేసే విమర్శలు కూడా ప్రజలను, బిజెపి వారిని ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇక ఇప్పుడు ఆయన తన నటనతో బిజెపిని బాగానే ఆకట్టుకున్నారు. లాంగ్ మార్చ్ ద్వారా భారీగా జన సమీకరణ చేసిన పవన్ కళ్యాణ్ తన సత్తా ఇది అని సంకేతాలు ఇచ్చేసారు. ఇక బిజెపి... పవన్ ని తనలో కలుపుకోవడమే తరువాయి అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: