నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగానే  జరుగుతున్నాయి. నేడు కూడా అసెంబ్లీ సమావేశం మొత్తం హాట్ హాట్ గానే జరిగింది. టిడిపి వైసిపి వాదోపవాదాల మధ్య సభ మొత్తం రసాభాసగా మారింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఘాటుగానే జరిగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సభ్యుల గందరగోళం మధ్య నేడు అసెంబ్లీ సమావేశం ముగిసిపోయింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ పలు అంశాలపై ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పై ప్రశ్నలు సంధించింది... పక్ష పార్టీ ప్రశ్నలకు అధికార పార్టీ ఘాటుగానే బదులిచ్చింది. 

 


 అయితే అసెంబ్లీలో కుక్క తోక వంకర అనే సామెతకు  ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే అని  సీఎం జగన్ రెండు చేతులు జోడించి చంద్రబాబు దండం పెట్టారు . కాగా దీనిపై చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. ఎవరిది కుక్క తోకొ  త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదాలి అనుకోని  ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు...కానీ  ఈరోజు మిమ్మల్ని నమ్మిన ప్రజలందరూ  మధ్యలోనే మునిగిపోయాం  అని బాధ పడే పరిస్థితి వచ్చినట్లు చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు.

 


 తొందర పెడకండి...  ముందుంది ముసళ్ళ పండగ అంటూ చంద్రబాబు హెచ్చరించారు.మీ  ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి...  కాని చేతలు మాత్రం కనీసం గడప కూడా దాటడం లేదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అప్పుడే అయిపోలేదు కేవలం 7 నెల్లకే సంబరపడిపోకండి .. ముందు ముందు ఇంకా చాలా ఉంది...మీ  కథలన్నీ ప్రజలు చూడాల్సి ఉంది అంటూ జగన్ వ్యాఖ్యలపై గట్టిగానే బదులిచ్చారు చంద్రబాబు నాయుడు. కాగా నేడు అసెంబ్లీ సమావేశం మొత్తం ప్రతిపక్ష అధికార పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు మధ్య వాడివేడిగా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: