ప్రపంచంలోని దేశాలలో ఒక దేశంలో ఆచారాలు మరో దేశంతో పోలిస్తే చాలా విషయాల్లో పూర్తి భిన్నంగా ఉంటాయి. కొన్ని దేశాలు పెళ్లి విషయంలో చిత్రవిచిత్రమైన విధానాలను అనుసరిస్తాయి. ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ దేశంలో న్యూర్, డింకా తెగలకు చెందిన మహిళల పెళ్లి వేడుకలు విచిత్రంగా జరుగుతాయి. భారతదేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కన్యాశుల్కంలాగానే దక్షిణ సూడాన్ లో ఇప్పటికీ కన్యాశుల్కం జరుగుతోంది. 
 
అమ్మాయిలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లుగా కొనుగోలు చేసే విచిత్ర సాంప్రదాయం ఇక్కడ ఉంది. అమ్మాయి తండ్రికి కన్యాశుల్కం కింద 
పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలు డబ్బు, కార్లు, పశువులు,ఇతర భారీ కానుకలు ఇస్తూ ఉంటారు. అమ్మాయి తండ్రి అబ్బాయి ఇచ్చిన కానుకలను తీసుకొని అమ్మాయిని అప్పగిస్తూ ఉంటాడు. దక్షిణ సూడాన్ లో కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా వివాహం జరిగితే మరికొన్ని ప్రాంతాలలో మరోలా కూడా వివాహం జరుగుతుంది. 
 
ఎవరి ఇంట్లో అబ్బాయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా లేదా చనిపోయినా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కుటుంబం నుండి భారీగా డబ్బులు తీసుకొని వివాహం చేయటానికి సిద్ధంగా ఉంటారు. అమ్మాయి తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే శవంతో పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడతారు. పెళ్లి చేసుకున్న మహిళ భర్త చనిపోతే అతని అన్న, తమ్మునితో పిల్లలను కనవచ్చు. భర్త అన్న, తమ్మునితో పిల్లలను కనడం ఇక్కడ తప్పు కాదు. 
 
ఇక్కడ మరో విచిత్ర ఆచారం కూడా అమలులో ఉంది. పెళ్లైన మహిళ తప్పనిసరిగా ఇద్దరు పిల్లలను కనాలి. మహిళ భర్త బ్రతికి ఉండి మహిళ ఇద్దరు పిల్లలను కనకపోతే ఆమె భర్త మరో మహిళను వివాహం చేసుకోవచ్చు. మహిళ తల్లిదండ్రులు కూడా వివాహానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ఈ వింత ఆచారాల గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: