తాజగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే కదా. ఒక్క శుక్రవారం నాడు మాత్రమే 10 మంది ప్రాణాలు కోల్పో పోవడం జరిగింది, తాజాగా మృతుల సంఖ్య 18కి చేరడం జరిగింది. ఈమృతులలో  ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇక శనివారం నాడు రామ్‌పూర్‌లో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్తతలు బాగా జరిగాయి. ఇక కాన్పూర్‌లో పోలీస్ ఔట్‌పోస్ట్‌కు సైతం నిప్పు పెట్టడం జరిగింది. ఇక ఈ అల్లర్లలో 269 మంది పోలీసులు కూడా గాయాల పాలు అవ్వడం జరిగింది, వారిలో 57 మందికి బుల్లెట్లు కూడా  తగిలాయి అని  యూపీ ఐజీ ప్రవీణ్‌కుమార్‌ తెలియచేయడం జరిగింది.

 

ఈ అల్లర్లలో మొత్తం 5,400 మంది అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఇంకా 705 మంది జైలుకు తరలించారు. ఇందులో దీపక్ కబీర్ అలియాస్ దీపక్ మిశ్రా, ఎస్ఆర్ దర్మపురి లాంటి ప్రముఖ సామాజిక కార్యకర్తలను కూడా  పోలీసులు  అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పోలీసులు  మొత్తం 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలియచేయడం జరిగింది. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపి వేయడం జరిగింది, కానీ వాట్సాప్‌లో వదంతులు జరిపారు అని 13,000 మందికిపైగా గుర్తించడం జరిగింది.

 

ఇక తాజాగా   14 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపి వేయడం జరిగింది.ఇక  పాఠశాలలు, కాలేజీలను కూడా  మూసివేయడం జరిగింది. యూపీలో హింస చాలా ఎక్కువ అవ్వడంతో   ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు చేపట్టాలి అని అధికారులకు తెలియచేయడం జరిగింది. ఇక మరో వైపు  ఆందోళనలు సందర్భంగా ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంపై చేసిన వారిపై  కమిటీ విచారణ చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఢిల్లీలో భీమ్‌ ఆర్మీ సంస్థ నేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.  చంద్రశేఖర్‌ ఆజాద్‌ కు  14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి తెలియచేయడం జరిగింది. ఇక మరో వైపు ఆజాద్‌ మాత్రం బెయిల్‌ కోసం చేసుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: